Home ఆంధ్రప్రదేశ్ ATM Cash Van Robbery : మర్రి చెట్టు తొర్రలో రూ.66 లక్షలు, ఆరా తీసి...

ATM Cash Van Robbery : మర్రి చెట్టు తొర్రలో రూ.66 లక్షలు, ఆరా తీసి అవాక్కైన పోలీసులు!

0

చోరీ సొత్తు మర్రి తొర్రలో

పోలీసుల దర్యాప్తులో సీఎంఎస్(CMS Employees) ఉద్యోగులే నిందితులని తేలిపింది. దొంగిలించిన డబ్బు(Chori) మొత్తాన్ని నిందితులు ఓ మర్రి చెట్టు తొర్రలో దాచి పెట్టడం ఇక్కడ విశేషం. ఒంగోలు సీఎంఎస్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ కొండారెడ్డి, సీఎంఎస్‌ మాజీ ఉద్యోగి మహేష్‌బాబ, రాచర్ల రాజశేఖర్‌ చోరీ చేసినట్లు గుర్తించారు. టెక్నికల్ ఆధారాలతో ముందు మహేష్ బాబును పట్టుకున్నామన్నారు. అతడిని విచారించగా… అసలు విషయం తెలిసిందన్నారు. చోరీ చేసిన నగదును మర్రి చెట్టు తొర్రలో దాచారని, డబ్బు రికవరీ ప్రకాశం ఎస్పీ(Prakasam SP) గరుడ్ సుమిత్ అనీల్ తెలిపారు. లింగారెడ్డి కాలనీలోని సీఎంఎస్‌ కార్యాలయం వద్ద రాజశేఖర్‌, కొండారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పనిచేస్తున్న కంపెనీకే కన్నం వేయాలని ప్రయత్నించి నిందితులు దొరికిపోయారు.

Exit mobile version