- ఎమ్మెల్యేపై అలిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
-పార్టీ ప్రచారానికి దూరంగా కార్యకర్తలు
తాండూర్ ఏప్రిల్ 20 :- వచ్చేనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమం శనివారం రోజు తాండూర్ప్రా మండలంలో ప్రారంభమైంది. అందులో భాగంగా మండలంలోని ఎల్మకన్య గ్రామంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమానికి కార్యకర్తలు దూరంగా ఉన్నట్లు గుసగుసలు వినిపించాయి . ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ మాకు ఎలాంటి గుర్తింపు లేకపోవడంతోనే ప్రచార కార్యక్రమానికి దూరం ఉన్నామని గ్రామానికి చెందిన కార్యకర్తలు వెంకట్ రెడ్డి శివరాజ్, చంద్రప్ప, నగేష్, రాములు, నర్సిములు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రచార కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు కనిపించింది. పార్టీ కోసం ఎంతో కష్టపడినా మాకు గుర్తింపు లేకపోవడంతోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై అలిగినట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఎన్నికల బీసీ లో ఉండడంతో ప్రతి కార్యకర్త ఎంతో ముఖ్యమనే సంకేతాలు సైతం ఉన్నప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని పలువురు పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.