“ధోనీ ఒక ఇన్స్పిరేషన్. ట్రైనింగ్‌లో చాలా గ్యాప్ వచ్చినా, తక్కువసేపే ట్రైనింగ్ చేసినా.. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వాస్తవానికి.. ధోనీ బ్యాటింగ్ మా టీమ్‌కి ఆశ్చర్యం అనిపించలేదు. ప్రీ సీజన్లో అతను చూపించిన స్కిల్‌ని చూస్తే.. ఈ సీజన్లో ఎలా ఆడతాడే మాకు అర్థమైపోయింది. ఇక.. ధోనీని బ్యాటింగ్ ఆర్డర్లో ఎందుకు ముందు పంపడం లేదని అడుగుతున్నారు. ధోనీకి మోకాలు సమస్య ఉన్న విషయం తెలిసిందే. దాని నుంచి ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాడు. అందుకే.. లిమిటెడ్ బాల్స్ ఆడాల్సి వస్తోంది,” అని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు.