త్వరలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితా
టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులకు(TSPSC Polytechnic Lecturers Recruitment ) టీఎస్పీఎస్సీ గత ఏడాది సెప్టెంబర్ 4 నుంచి 6 , 8వ తేదీన రాత పరీక్ష నిర్వహించింది. ఈ రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల సాధారణ ర్యాంకింగ్ జాబితాను(Polytechnic Lecturers Rankings) టీఎస్పీఎస్సీ https://www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచింది. సాధారణ ర్యాంకింగ్ జాబితా ప్రకారం మెరిట్ జాబితాను తయారుచేస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్(Short List) చేసిన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ర్యాంకింగ్ జాబితాలో రిజెక్ట్ చేసిన వారిని జనరల్ ర్యాంకింగ్ జాబితాలో చేర్చలేదని పేర్కొంది.