posted on Apr 20, 2024 5:34PM
మొన్నటి వరకు యువతరాన్ని పబ్జీ పిచ్చి పట్టి పిడించింది. అంతకు ముందు వున్నంత ఉద్ధృతి లేకపోయినప్పటికీ యువతరంలో ఇప్పటికీ చాలామంది ఆ పిచ్చిలో వున్నారు. ఇప్పుడు అలాంటి ప్రాణాంతకమైన మాయదారి ఆట అమెరికాలో స్టూడెంట్స్ చనిపోవడానికి కారణం అవుతోంది. ఆ ఆట పేరు బ్లూ వేల్ ఛాలెంజ్ (Blue Whale Challange). ఈ గేమ్ పిచ్చిలో పడిన చాలామంది యువతీ యువకులు గతంలో చనిపోయారు. ఈ మధ్యకాలంలో ఈ గేమ్ వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని భారత సంతతికి చెందిన యువకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ముసాచుసెట్స్ యూనివర్సటీకి చెందిన ఒక విద్యార్థి మరణించారు. ఈ మరణానికి కారణం బ్లూ వేల్ ఛాలెంజ్ ఆట అని పోలీసులు భావిస్తున్నారు. రెండు నిమిషాలపాటు ఊపిరి బిగపట్టడం వల్ల ఆ విద్యార్థి మరణించాడని పోలీసులు చెబుతున్నారు. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్‌లో ఊపిరి బిగపట్టే టాస్క్ వుంటుందని పోలీసులు తెలిసారు.
మొదట రష్యాలో ప్రారంభమైన ఈ ఆన్లైన్ గేమ్ క్రమంగా ఆ ఆట ఆడేవాళ్ళను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. ఈ గేమ్ వల్ల జరుగుతున్న అనర్థాలను గ్రహించిన అనేక దేశాలు ఈ ఆటకు సంబంధించిన నెట్వర్క్.లు తమ దేశంలో కనిపించకుండా జాగ్రత్తపడ్డాయి. ఈ గేమ్‌లో వుండే క్యూరేటర్ ఆడేవారికి రకరకాల ప్రమాదకరమైన టాస్క్.లు ఇస్తుంటాడు. అర్ధరాత్రి నిద్ర లేవడం, భయంకరమైన దృశ్యాలను చూడటం, ఎత్తయిన టవర్ల అంచున నిలబడటం, గాయాలు చేసుకోవడం, ఊపిరి బిగబట్టడం లాంటి టాస్క్.లు ఇస్తాడు. ఈ టాస్క్.లు చేసేటప్పుడు ఆడే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం లేదా ప్రమాదానికి గురై చనిపోవడం జరుగుతోంది.
ఒక్కసారి ఈ గేమ్‌లోకి ఎంటరైతే బయటపడటం చాలా కష్టం. మానసికంగా తప్పుదోవ పట్టించి, ఒక్కోసారి బెదిరించి టాస్క్.లను పూర్తి చేసేలా ప్రేరేపిస్తారు.