Home తెలంగాణ పాపం కేటీఆర్.. బావమరిదీ కారు దిగి చేయందుకున్నారు! | ktr wife brother joins congress|...

పాపం కేటీఆర్.. బావమరిదీ కారు దిగి చేయందుకున్నారు! | ktr wife brother joins congress| netizens| question| brs| working| president| capabilities| leading

0

posted on Apr 20, 2024 10:29AM

అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం.. అధికారం ఉంటేనే నిలిచే బంధం అని వగచడమే మిటిలింది ఆయనకు.  పార్టీ ఓటమి తరువాత కేటీఆర్ నోటి దురుసు పెరిగింది. గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పైనే కాదు.. ఓటమి తరువాత పార్టీ వదిలి వెడుతున్న వారిపై కూడా ఆయన ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ద్రోహులంటూ నిందిస్తున్నారు. అయితే తాటాకు చప్పుళ్ల లాంటి ఆయన  దూషణలకు, బెదరింపులకు ఎవరూ వెరిచి వెనకడుగు వేయడం లేదు. వలసల దారి వలసలుగానే ఉంది.

ఒక్క కేటీఆర్ మాటలు మాత్రం రీసౌండ్ లా ఆయనకే అందరి కంటే గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో అధికారంలో ఉండగా పార్టీ అధినేత, తన తండ్రి అయిన కేసీఆర్ రాజకీయ వ్యూహమే ఇప్పుడు రివర్స్ లో పార్టీని ఖాళీ చేస్తున్నట్లు కేటీఆర్ కు అవగతం అవుతోందా అంటే నెటిజనులు జోకులు పేలుస్తున్నారు. సరే పార్టీ నేతలు, సిట్టింగులు మారుతున్నారు సరే.. స్వయానా బంధువులు కూడా బంధుత్వానికీ బే, పార్టీకీ బేబ్బే అంటూ  ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్  కండువా కప్పుకుంటూ కారు దిగిపోవడాన్ని ఆయన ఎలా జీర్ణించుకుంటారో పాపం అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

 తాజాగా కేటీఆర్ కు స్వయానా బావమరిది అయిన ఎడ్ల రాహుల్ రావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తన భార్య సోదరుడు, పైగా బావ  అధికారంలో ఉండగా ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న రాహుల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఏ విధంగా చూసినా కేటీఆర్ కు చెప్పుకోలేని పరాభవంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పైగా రాహుల్ రెడ్డికి కాంగ్రెస్ గూటికి చేర్చింది.. అసెంబ్లీ ఎన్నికల ముందు కేటీఆర్ తో విభేదించి కారు దిగి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మైనంపల్లి హనుమంతరావు కావడం కేటీఆర్ కు మరింత ఇబ్బంది కలిగించే అంశంగా చెబుతున్నారు.  

ఇటీవలి కాలంలో అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కారు దిగి వెళ్లి పోతున్న నేతలను నిలువరించడంలో ఘోరంగా విఫలమై.. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి పార్టీ వదిలి వెడుతున్న వారిపై దూషణలకు దిగుతూ, ద్రోహులూ అవకాశ వాదులూ అంటూ నిందిస్తున్న కేటీఆర్ ఇప్పుడు తన బావమరిదే  బీఆర్ఎస్ కు జెల్ల కొట్టి కాంగ్రెస్ పంచన చేరడం ఎలా చూసినా తట్టుకోలేని అవమానంగానే పరిశీలకులు చెబుతున్నారు.  పార్టీ మారకుండా సొంత బావమరిదిని నిలువరించలేని కేటీఆర్.. పార్టీని ఏం కాపాడుతారంటూ  కేటీఆర్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా కేటీఆర్ వైఫల్యాలపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. 

Exit mobile version