Tillu Squre OTT Release: టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఏప్రిల్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ శుక్రవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో టిల్లు స్క్వేర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి రావడం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.