Home బిజినెస్ Google Pixel 9 : గూగుల్​ పిక్సెల్​ 9లో అదిరిపోయే ‘ఏఐ’ ఫీచర్స్​..

Google Pixel 9 : గూగుల్​ పిక్సెల్​ 9లో అదిరిపోయే ‘ఏఐ’ ఫీచర్స్​..

0

గూగుల్ పిక్సెల్ 9 ఆన్-డివైస్ ఏఐ ఫీచర్లు..

పిక్సెల్ 9 డివైజ్​లో ఊహాజనిత ఏఐ ఫీచర్లను వెల్లడిస్తూ అసెంబుల్ డెబగ్ అనే టిప్​స్టర్ ఒక ఎక్స్ (ట్విట్టర్​) పోస్ట్​ను షేర్​ చేశాడు. పిక్సెల్ 9 సిరీస్ మెరుగైన ఆన్-డివైజ్ ఏఐ సామర్థ్యాలతో వస్తుందని భావిస్తున్నారు. గూగుల్ ఏఐ కోర్ యాప్ తాజా వెర్షన్, గూగుల్ మెసేజెస్ బీటా నుంచి ఈ ఫీచర్లు వెల్లడయ్యాయి. పిక్సెల్ 9 సిరీస్ ఏఐ ఫీచర్లలో టెక్స్ట్-టు-ఇమేజ్ కన్వర్షన్స్, మ్యాజిక్ కంపోజర్, ఆటోఫిల్ స్మార్ట్ రిప్లై, సారాంశం, ప్రూఫ్ రీడింగ్స్​, టెక్స్ట్ కేటగరైజేషన్​ వంటివి ఉంటాయి. అదనంగా, ఈ ఆన్-డివైజ్ ఏఐ ఫీచర్లు క్లౌడ్ కనెక్షన్​పై ఆధారపడవని తెలుస్తోంది..

Exit mobile version