కన్యాకుమారి, రామేశ్వరం, ముధురై టూర్
మధురై(Madurai)ని ఏథెన్స్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు. మధురై తమిళనాడులోని పురాతన నగరం. ఉత్తమ మల్లె పువ్వుల పంటల ఉత్పత్తికి పేరొందింది. మధురై మీనాక్షి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కన్యాకుమారి(Kanyakumari)…భారతదేశ దక్షిణ భాగంలో చివరి ప్రాంతం. మూడు మహాసముద్రాలు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిసే స్థానం కన్యాకుమారి. సూర్యోదయం, సూర్యాస్తమయం అందమైన దృశ్యాలకు కన్యాకుమారి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో రామేశ్వరం ఒకటి. రామనాథస్వామి దేవాలయం పొడవైన ఆలయ కారిడార్‌కు ప్రసిద్ధి. దక్షిణాది బెనారస్ పిలిచే రామేశ్వరాన్ని(Rameswaram) కాశీకి తీర్థయాత్ర పూర్తైన తర్వాత సందర్శిస్తుంటారు.