ఎందుకు తినకూడదు?
నారింజ, నిమ్మ, ద్రాక్ష, కివి, పైనాపిల్ పండు… ఇవన్నీ కూడా సిట్రస్ పండ్ల జాతికి వస్తాయి. అంటే ఈ పండ్లలో సిట్రిక్ యాసిడ్ నిండి ఉంటుంది. ఇది పుల్లని రుచిని ఇస్తుంది. ఇతర ఆహారాలతో పోలిస్తే సిట్రస్ పండ్లలోని ఆమ్లాలు త్వరగా విచ్చిన్నమవుతాయి. కాబట్టి మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తిన్నాక ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో టాక్సిన్లు ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని ‘అమా’ అని పిలుస్తారు. ఎందుకంటే ఆహారాన్ని జత చేయడం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది.