హెచ్.టి.తెలుగు ప్రతినిధి : పేదరికం నుంచి పై కొచ్చారు.. ఎలాంటి కష్టాలు అనుభవించారు?
సాయికిరణ్ – తల్లిదండ్రుల కష్టపడితేనే పూట గడిచేది. అలాంటి పరిస్థితులు ఉన్నా నా చదువుకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా పేరెంట్స్ చదివించారు. అక్క స్రవంతి, నేను చదువులో మెరిట్ స్టూడెంట్ గా ఉన్నాం. కన్నవారి కష్టాలను కళ్లారా చూసిన నేను వారి శ్రమ వృథా కాకుండా కష్టపడి చదివాను. వరంగల్ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ అయిపోగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాను. ఉద్యోగం చేయడంతో ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాను. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ముందుకు సాగాను. ఫస్ట్ అటెంప్ట్ లో లక్ష్యం నెరవేరలేదు. రెండో అటెంప్ట్ సమయంలో ఈసారి రావాలి, లేకుంటే మరోసారి సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ కానని భావించాను. కానీ రెండో అటెంప్ట్ లోనే లక్ష్యాన్ని ఛేదించాను. హ్యాపీగా ఉంది.