Sunday, December 29, 2024

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍ భారత జట్టులో ‘కుల్చా’ జోడీ ఉండనుందా?

T20 World Cup 2024 – Team India: భారత స్టార్ స్పిన్నర్లు కుల్‍దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ జోడీ.. ‘కుల్చా’గా ఫేమస్ అయింది. ఈ ఇద్దరూ కలిసి తమ స్పిన్ మ్యాజిక్‍తో చాలా మ్యాచ్‍ల్లో టీమిండియాను గెలిపించారు. అయితే, కొంతకాలంగా భారత జట్టులో చాహల్‍కు చోటు దక్కడం లేదు. చివరగా గతేడాది వెస్టిండీస్ పర్యటనలో ఆడాడు. ఆ తర్వాత గతేడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‍లో చాహల్‍కు చోటు దక్కలేదు. దీంతో అతడు మళ్లీ భారత జట్టులోకి రావడం కష్టమనే వాదనలు వినిపించాయి. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ తరఫున లెగ్ స్పిన్నర్ చాహల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో అతడిని టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana