Saturday, January 11, 2025

వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. ఎన్డీయే విజయం తథ్యం.. కేశినేని శ్రీదేవి | progress nil in ycp rule| tdp| alliance win| sure| kesineni

posted on Apr 16, 2024 4:07PM

35వ డివిజ‌న్ లో ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం 

కేశినేని శ్రీదేవి, యలమంచిలి ఉమారాణి అపూర్వ స్వాగ‌తం

ఎన్నిక‌ల ప్ర‌చారానికి  విశేష స్పంద‌న‌

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌చివాల‌యానికి రాకుండా..తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాడ‌ని…ఈ ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎక్క‌డా అభివృద్ది జ‌ర‌గ‌లేదు అంతా శూన్యమ‌ని  టిడిపి విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ది  కేశినేని శివ‌నాథ్ సోద‌రి కేశినేని శ్రీదేవి అన్నారు. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ టిడిపి అభ్య‌రి కేశినేని శివ‌నాథ్, ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్య‌ర్ధి సుజ‌నా చౌద‌రి విజ‌యాన్ని కాంక్షిస్తూ 35వ డివిజ‌న్ లో వ‌రుస‌గా రెండో రోజు మంగ‌ళ‌వారం కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం య‌ల‌మంచిలి ఉమారాణితో క‌లిసి నిర్వ‌హించారు.

ఈ ఎన్నిక‌ల ప్ర‌చారం పెజ్జోని పేట‌, బాప్టిస్ట్ న‌గ‌ర్ లో సాగింది. కేశినేని శ్రీదేవి గారు ఇంటింటికి వెళ్లి సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల క‌ర‌ప‌త్రాలు పంపిణి చేసి..జ‌గ‌న్ చేసిన దుర్మార్గ‌పు పాల‌న గురించి..ఎన్డీయే అధికారంలోకి రాగానే చంద్ర‌బాబు గారు ముఖ్య‌మంత్రి అమ‌లు చేయ‌బోయే ప‌థ‌కాల‌ను వివ‌రించారు. అలాగే సుజ‌నా చౌద‌రిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేయ‌బోయే ప్ర‌ణాళిక గురించి తెలియ‌జేశారు. చంద్ర‌బాబు హ‌యంలో ప్ర‌తి పండ‌గ‌క్కి పేద ప్ర‌జ‌ల‌కు  కానుక‌లు ఇచ్చేవార‌ని, జ‌గ‌న్  ఏ పండుగ‌క్కి కానుకలు ఇవ్వ‌లేద‌న్నారు.  అధికారంలోకి రాగానే చంద్ర‌బాబు గారు మ‌ళ్లీ పండుగ కానుక‌లు ఇస్తార‌న్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ ప్రెసిడెంట్ బూదాలి నంద‌కుమారి గారు, సెక్ర‌ట‌రీ ఇత్త‌డి నాగ‌ల‌క్ష్మీ, ఇత్త‌డి చార్లెస్ గారు, క్ల‌స్ట‌ర్ ఇన్చార్జ్ హ‌నుమంతురావు గారు, బూత్ క‌న్వీన‌ర్లు కొద‌మ‌ల రాజు గారు, మ‌ణిబాబు, ర‌వికిషోర్, ఆసిఫ్, భాస్క‌ర‌రావు , క‌ర్రి సునీత‌, బిజెపి మ‌హిళ నాయ‌కురాలు నాగ‌ల‌క్ష్మీ గార్ల‌తోపాటు బిజెపి టిడిపి, జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana