Tuesday, December 24, 2024

కరీంనగర్ కుర్రోడికి యూపీఎస్సీ సివిల్స్ లో 27వ ర్యాంక్-karimnagar youth sai kiran who got 27th rank in upsc civil services 2023 results ,తెలంగాణ న్యూస్

పాలమూరు బిడ్డకు మూడో ర్యాంక్

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 తుది ఫలితాలు(UPSC Civils 2023 Results) విడుదల అయ్యాయి. సివిల్స్ ఫైనల్ రిజల్ట్స్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. సివిల్స్-2023 ఫలితాల్లో తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్య తన ఫస్ట్ అటెంప్ట్ లోనే మూడో ర్యాంకు(UPSC AIR 3rd Rank) సాధించారు. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు రావడంపై అనన్య రెడ్డి (Donuru Ananya Reddy)సంతోషం వ్యక్తం చేశారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నానన్నారు. ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజులు 12-14 గంటలు చదివేదానినని ఆమె తెలిపారు. సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల‌కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలిపారు. తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్ కు ఎంపికవటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana