Friday, November 1, 2024

కంటోన్మెంట్ లో త్రిముఖ పోటీ  | A three-way contest in Cantonment

posted on Apr 16, 2024 2:43PM

సికింద్రాబాబ్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగుతోంది. ఈ స్థానం నుంచి వంశా తిలక్ ను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ టీఎన్ వంశా తిలక్ పేరును బీజేపీ ఖరారు చేసింది. మాజీ మంత్రి సదాలక్ష్మి, పద్మశ్రీ అవార్డు గ్రహీత టివి నారాయణ కుమారుడే వంశా తిలక్‌. బీజేపీ అభ్యర్థి ప్రకటనతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఉపఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోయింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహిస్తోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు.కాంగ్రెస్ పార్టీ శ్రీగణేశ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 13న లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది.మెుదటగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరిన వెంటనే అభ్యర్థిగా ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదితకు ఛాన్స్ ఇచ్చింది బిఆర్ఎస్.  సాయన్న మరణంతో కంటోన్మెంట్ టికెట్ ఆయన కూతురు లాస్య సందితకు కేటాయించింది . కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెలపై ఆమె గెలుపొందినప్పటికీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతిచెందారు. అయితే గులాబీ బాస్ కె. చంద్రశేఖర్ రావు  మళ్లీ సాయన్న కుటుంబం నుంచే మరోసారి టికెట్ ఇచ్చింది. లాస్య నందిత సోదరి నివేదితకు బిఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.   తాజాగా బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టీఎన్ వంశీ తిలక్ పేరును ఖరారు చేశారు. ఈ సీటు కోసం చాలా మంది బీజేపీ నేతలు ఆశలు పెట్టుకోగా.. చివరకు తిలక్ పేరును ఫైనల్ చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana