Sunday, November 17, 2024

భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు పట్టు చీర కానుక-sircilla handloom weaver gold pattu saree for bhadrachalam sitarama kalyanam ,తెలంగాణ న్యూస్

నాడు అయోధ్య- నేడు భద్రాద్రి

పుణ్య దంపతులు.. ఆదర్శమూర్తులు… అయోధ్య(Ayodhya) రామయ్య సీతమ్మ కోసం సిరిసిల్ల చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ దంపతులు గతంలో బంగారు చీర అందించారు. నేడు భద్రాచలం సీతమ్మకు బంగారు చీరను నేశారు. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో 20 రోజులు శ్రమించి అయోధ్యలో బాలరాముడు(Ayodhya Balaram) విగ్రహ ప్రాణప్రతిష్ట సమయంలో బంగారు చీరను తయారు చేశారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరలో పొందుపర్చడం విశేషం. లక్షా 50 వేల వ్యయంతో మగ్గంపై తయారు చేసిన చీరను గత జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామయ్య పాదాల చెంతకు చేర్చారు. దైవభక్తితో నేతన్న కళానైపుణ్యాన్ని చాటిచెప్పేలా హరిప్రసాద్ బంగారు పట్టు చీరలను(Gold Pattu Saree) తయారు చేయడంతో పలువురు అభినందిస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana