Suzuki access 125 on road price hyderabad : సరికొత్త సుజుకీ యాక్సెస్ 125 సీట్.. ప్రస్తుత వర్షెన్‌తో పోల్చితే మరింత ఫ్లాట్‌గా ఉంది. అంటే.. పిలియన్ రైడర్స్‌కి కంఫర్ట్ మరింత పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. హజార్డ్ లైట్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటివి ఇందులో ఫీచర్స్‌గా ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఫీచర్స్ దాదాపు ప్రతి స్కూటర్లోనూ కనిపిస్తున్నాయి. అందుకే.. పోటీని తట్టుకునేందుకు.. వీటిని యాక్సెస్ 125లో సంస్థ యాడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.