IPL 2024 – Shivam Dube: జూన్‍లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియాలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‍రౌండర్‌గా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలో ఎవరికి చోటు దక్కాలన్న విషయంపై చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధనాధన్ బ్యాటింగ్‍తో శివమ్ దూబే మెప్పిస్తున్నాడు. సీనియర్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంతగా ఫామ్‍లో లేడు. అయితే, హార్దిక్‍కు ఎక్కువ అనుభవం ఉంది. దీంతో టీ20 ప్రపంచకప్‍కు బీసీసీఐ ఆ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలన్న విషయంపై కొందరు మాజీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. భారత మాజీ బ్యాటర్ మనోజ్ తివారీ కూడా ఈ విషయంపై మాట్లాడాడు.