మోటోరోలా కొత్త స్మార్ట్ఫోన్- ఇతర విశేషాలు..
ఈ వారం ప్రారంభంలో.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా గీక్బెంచ్లో కనిపించింది. ఆకట్టుకునే సింగిల్-కోర్ సీపీయూ స్కోరు 1,947, మల్టీ-కోర్ స్కోరు 5,149. 3.01 గిగాహెర్ట్జ్ గరిష్ట వేగంతో నడిచే హై-పెర్ఫార్మెన్స్ కోర్, 2.80 గిగాహెర్ట్జ్ వద్ద నాలుగు కోర్లు, 2.02 గిగాహెర్ట్జ్ వద్ద మూడు కోర్లు పనిచేస్తాయి. ఈ సీపీయూ కాన్ఫిగరేషన్లు స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్ వోసీకి అనుగుణంగా ఉంటాయి. 12 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుందని తెలిపింది.