- ఐసీఏఆర్ ఏఐఈఈఏ అధికారిక వెబ్ సైట్ icarpg.ntaonline.in ను ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024 రిజిస్ట్రేషన్ (ICAR AIEEA Exam 2024 registration) లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోండి.
ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024 దరఖాస్తు ఫీజు
ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ 2024 కు అప్లై చేయడానికి జనరల్/అన్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు రూ.1200, ఓబీసీ-ఎన్సీఎల్/యూపీఎస్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.1100, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.625 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్/ యూపీఐ ద్వారా ఈ ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ పరీక్షల అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.