శ్రీరామ్ ఫైనాన్స్: మరో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ అయిన శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance) 12 నుండి 60 నెలల కాలపరిమితికి సంవత్సరానికి 7.85 నుండి 8.80 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. కొత్త వడ్డీ రేట్లు 2024 ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చాయి. శ్రీరామ్ ఫైనాన్స్ ఎఫ్డీలు ఇక్రా (ICRA) ద్వారా ఎఎ + (స్థిరమైన) రేటింగ్ ను పొందాయి. 50 నెలలు లేదా 60 నెలల డిపాజిట్లకు గరిష్టంగా 8.80 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. 42 నెలల కాలపరిమితితో ఉన్న ఎఫ్డీలకు 8.75 శాతం, అలాగే 36 నెలల కాలపరిమితి ఎఫ్డీలకు 8.7 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే, 30 నెలల కాలపరిమితి ఎఫ్డీలకు 8.35 శాతం, 18 నెలల కాలపరిమితికి 8% , 12 నెలలకు 7.85 శాతం వడ్డీ రేట్లను శ్రీరామ్ ఫైనాన్స్ అందిస్తోంది.