Hyderabad Ananthagiri Hills Tour : అనంతగిరి హిల్స్…. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండే ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే…ఈ ప్రాంతాన్ని తెలంగాణ అరకులోయగా అభివర్ణించవచ్చు. ఇక్కడి పచ్చదనం, లోయలు, జలపాతాలు చూస్తే… ప్రతి మనసును కట్టిపడేస్తాయి. అరకు లోయను తలపించే ఇక్కడి హిల్స్(Ananthagiri Hills Tour) అద్భుతంగా ఉంటాయి. గత కొంతకాలంగా ఇక్కడ మౌలిక వసతులతో పాటు వచ్చే టూరిస్టుల సంఖ్య గణంగా పెరుగుతోంది. అయితే ఈ ప్రాంతాన్ని చూసేందుకు తెలంగాణ టూరిజం వన్ డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తుంది. ఒక్కరోజులోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి వారంలో శనివారం, ఆదివారం తేదీల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.