Home తెలంగాణ ఆ ఆడబిడ్డల గుండెఘోష – వైసీపీకి సెగ | The heartbeat of that girl...

ఆ ఆడబిడ్డల గుండెఘోష – వైసీపీకి సెగ | The heartbeat of that girl child

0

posted on Apr 13, 2024 2:12PM

ఏపీ రాజ‌కీయాల్లో  షర్మిల -సునీత వ్యాఖ్యలు కలకలంగా మారుతున్నాయి. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల తన చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిపైనా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తన అన్న జగన్ పైన విరుచుకుపడుతున్నారు. మనిషి పుట్టుక పుట్టి, కడుపుకు అన్నంతినే ఎవరికైనా ఆ మాటలు వింటే హృదయం ద్రవించక మానదు. ఆ వీడియో  చూస్తే ఎవ‌రికైనా గుండె బరువెక్కుతుంది. ఒక ఆడబిడ్డ మండుటెండలో నడిరోడ్డుపైన నిలబడి “నేనూ నాసోదరి ఇద్దరమూ కొంగుచాపి/కొంగుపట్టి మిమ్మల్ని ప్రాధేయపడి మాకు న్యాయంచేయమని అడుగుతున్నాము” అనే మాట సామాన్యమైనదికాదు. రాజకీయాలకు మతాలకు కులాలకు అతీతంగా, మానవత్వం సంస్కారం ఉన్నటువంటి ఏమతస్తులకైనా ఏకులస్తులకైనా ఏప్రాంతంవాళ్లకైనా సరే ఆ ఆడబిడ్డల దృశ్యంచూసి ఆమాటలు వింటే కళ్ళల్లో నీళ్లు రాకమానవు. ఆ ఆడబిడ్డల కన్నీటి చుక్కలు అవతలివాళ్లను దహించకమనవు, ఆ ఆడబిడ్డల గుండెఘోష వాళ్లకు రాజకీయ సామాజిక సజీవసమాధి అవకతప్పదు. ఒక భారతీయ ఆడబిడ్డ జీవితంలో ఎంతగా మనోవేదనకు మోసానికి అణచివేతకు దురహంకారానికి గురైతేగానీ ఇంతగా బయటకొచ్చి, రక్తసంబంధాలను కూడా పక్కకునెట్టి మాట్లాడుతున్నారో మనం అర్థంచేసుకోవచ్చు.

ఇక షర్మిల – సునీత చేస్తున్న వ్యాఖ్యలపైన వైఎస్సార్ సోదరి విమల స్పందించారు. కుటుంబ ఆడ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైయ‌స్‌ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని విమల  రాజ‌కీయం చేస్తున్నారు.  తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తానూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నట్లు ఆమె చెబుతున్నారు. 

అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారని చెప్పుకొచ్చారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకని వ్యాఖ్యానించారు. వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే తనకే ఎక్కువ ఇష్టమని ఆమె చెబుతున్నారు.  మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండిని ఓ స‌ల‌హా కూడా ఆమె ఇచ్చారు.

నిజానికి అటు సునీత‌, ఇటు ష‌ర్మిల‌లు వైసీపీకి సెగ పుట్టిస్తున్నారు. ఎక్కడ ఏవేదిక ఎక్కినా.. జ‌గ‌న్‌ను ఉతికి ఆరేస్తున్నారు. వివేకా హ‌త్య‌ను ప్ర‌ధాన వ‌స్తువుగా తీసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇవి ఎంత‌గా ఉన్నాయంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు.. టీడీపీ, జ‌న‌సేన‌లు కూడా చేయ‌నంత‌గా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ నేరుగా వారిని ఏమీ అన‌లేక‌.. అలాగ‌ని ఉండ‌లేక స‌త‌మ‌తం అవుతున్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల కీల‌క‌ద‌శ‌లో జ‌గ‌న్ ఇప్ప‌టికే క‌డ‌ప‌లో ప‌ర్య‌ట‌న‌లు పూర్తి చేసుకున్నారు. మ‌ళ్లీ క‌డ‌ప‌కు వెళ్లే అవ‌కాశం లేదు. కానీ, ఇప్పుడు ష‌ర్మిల‌, సునీత‌లు క‌డ‌ప‌లో ప్ర‌చారం ప్రారంభించారు. అంటే.. వారు లైవ్‌లో ఉండ‌నున్నారు. పైగా ఎన్నిక‌ల‌కు మూడు వారాల ముందు వ‌ర‌కు ష‌ర్మిల క‌డ‌ప‌లోనే ఉండి.. సునీత పూర్తిగా అక్క‌డే తిష్ఠ‌వేసి చేసే ప్ర‌చారం ఎన్నిక‌ల వేళ తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంది.

Exit mobile version