ఐదేళ్లు గడుస్తున్నా వైఎస్ వివేకాను చంపిన అవినాష్ రెడ్డికి శిక్షపడలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పులివెందులలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల, న్యాయం వైపు ఉంటారో.. అవినాష్ వైపు ఉంటారో ఇక్కడి ప్రజలు తెలుసుకోవాలన్నారు. రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని చంపిన వ్యక్తిని జగన్ అధికారంతో కాపాడుతున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.