యాత్ర 2తో టాలీవుడ్ ఎంట్రీ…
జగన్ పాత్రలో జీవా బాడీలాంగ్వేజ్, మేనరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. రంగంతో పాటు పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులుకు చేరువైన జీవా…యాత్ర 2 మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ పొలిటికల్ బయోపిక్‌లో చంద్రబాబు క్యారెక్టర్‌లో మహేష్ మంజ్రేకర్, వైఎస్ భారతిగా కేతకీ నారయణన్ కనిపించారు. సోనియా గాంధీ, కేవీపీ, కొడాలి నానితో పాటు చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్‌ను ఈ సినిమా కోసం రీ క్రియేట్ చేశాడు మహి వి రాఘవ్. యాత్ర 2 మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.