అలాగే రాశీ ఖన్నా మాయ అనే పాత్ర చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు. అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ ‘అరణ్‌మనై’కి నాల్గవ వెర్షన్ మరింత బిగ్గర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుందర్ సి దర్శకత్వం వహించడంతో పాటు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ‘బాక్’గా టైటిల్ ఫిక్స్ చేశారు. తమన్నా, రాశి ఖన్నా, సుందర్ సి, వెన్నెల కిషోర్‌తోపాటు, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.