ప్రజలకు అలర్ట్
గురువారం నంద్యాల జిల్లా నందవరంలో 42.6°C, వైఎస్సార్ జిల్లా(YSR District) చక్రాయపేటలో 42.5°C, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.7°C, కర్నూలు జిల్లా వగరూరులో 41.6°C, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 41.4°Cఅధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో తీవ్రవడగాల్పులు, 20 మండలాల్లో వడగాల్పులు(AP Heat Wave) వీచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.