Saturday, January 18, 2025

మహబూబాబాద్ లో విషాదం, పిల్లల్ని చంపిన పేరెంట్స్ ఉరేసుకుని ఆత్మహత్య-mahabubabad crime news parents killed two daughters with poisoned milk committed suicide ,తెలంగాణ న్యూస్

పాలల్లో విషం కలిపి

అనిల్ తండ్రి వెంకన్న అంకన్న గూడెంలో చిన్నపాటి కిరాణం షాప్ నడిపిస్తుంటాడు. వెంకన్న రోజువారీలాగే దుకాణం తీసేందుకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కొడుకు అనిల్, కోడలు దేవి కనిపించలేదు. దీంతో వారి కోసం వెతుకుతుండగానే లోహిత, జశ్విత ఇద్దరూ విగతాజీవులుగా కనిపించారు. అది చూసి కంగు తిన్న వెంకన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంకన్న నుంచి సమాచారం అందుకున్న మహబూబాబాద్(Mahabubabad) డీఎస్పీ తిరుపతి రావు, సీఐ రవి కుమార్, ఎస్సై జీనత్ కుమార్ హుటాహుటిన అంకన్న గూడెం చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, వెంకన్న ను విచారించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇంట్లో పరిశీలించగా మంచంపై పాల సీసా కనిపించగా, దాన్ని సేకరించారు. గదిలో ఓ చోట చిరిగి ఉన్న పాల ప్యాకెట్ తో పాటు అనిల్ దేవిల దుస్తుల బ్యాగ్ లో పురుగుల మందు డబ్బాను గుర్తించారు. దీంతో పాలల్లో విషం(Milk Poison) కలిపి చిన్నారులను హతమర్చారనే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana