Home తెలంగాణ మీనా గారూ.. ఏపీ గురించీ ప్రార్థించండి! | meena sir pray for ap also|...

మీనా గారూ.. ఏపీ గురించీ ప్రార్థించండి! | meena sir pray for ap also| sec| tirumala| ap| elections| peaceful

0

posted on Apr 12, 2024 3:59PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల వర్క్.లో బిజీగా వున్నారు. మధ్యమధ్యలో కాస్త వెసులుబాటు కల్పించుకుని రాష్ట్రంలో వున్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన సతీమేతంగా తిరుమల శ్రీవారిని సందర్శించారు. దేవాలయం నుంచి ప్రశాంత వదనాలతో బయటకి వచ్చిన ముఖేష్ కుమార్ మీనా కుటుంబాన్ని చూస్తుంటే, ఏపీ ఎన్నికలు కూడా ఇంతే ప్రశాంతంగా జరిగితే బాగుండు కదా.. ఎన్నికల సందర్భంగా ఓటర్లు కూడా ఇంత ప్రశాంతంగా ఉండగలిగితే బాగుంటుంది కదా అనిపించింది. 

గత ఎన్నికల సందర్భంగా అధికారంలో లేకపోయినప్పటికీ వైసీపీ గూండాలు చేసిన అరాచకాలు, ప్రజాస్వామ్యంతో ఆడిన పరాచికలు చూశాం. రాజకీయాలు ఇలా కూడా వుంటాయా అనుకుని ఆశ్చర్యపోయాం. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే భయంలో ఏపీ ప్రజలు వున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్  మీనా పనితీరును చూస్తుంటే ఈసారి వైసీపీ తప్పులు ఉడకవన్న నమ్మకం కలుగుతోంది. ఎందుకంటే, లేట స్ట్.గా ఆయన, ప్రభుత్వ సలహాదారు హోదాలో వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న సజ్జలకి వార్నింగ్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనాకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఒక విన్నపం. అదేంటంటే, ముఖేష్ గారూ, మీరు ఏపీలో మీకు వీలైనన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించండి. మీ కుటుంబం మేలు కోసం ప్రార్థించండి. పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కూడా ప్రార్థించండి. ఎన్నికలు సక్రమంగా జరగాలని, దొంగ ఓట్లు పడకూడదని, దౌర్జన్యాలు జరక్కూడదని, రిగ్గింగుల్లాంటివి జరక్కూడదని, ఓటింగ్ ప్రక్రియలోకి వైసీపీ కార్యకర్తల్లాంటి వాలంటీర్లు ఎంటరవ్వకూడదని, పోలింగ్‌కి – కౌంటింగ్‌కి మధ్య ఏ గూడుపుఠానీలు జరక్కూడదని, కౌంటింగ్ న్యాయంగా జరగాలని ప్రార్థించండి సార్… పోనీ, అలా ప్రార్థించినా, ప్రార్థించకపోయినా, పైన పేర్కొన్న న్యాయమైన విషయాలు అమ లయ్యేలా ఒక నిస్పాక్షిమైక ఎన్నికల అధికారిగా పనిచేయండి.

Exit mobile version