Home తెలంగాణ క్రోధులకు బుద్ధి చెప్పే శ్రీ క్రోధి | will krodhi nama telugu year teach...

క్రోధులకు బుద్ధి చెప్పే శ్రీ క్రోధి | will krodhi nama telugu year teach lesson to anachists| ycp| rule| five| years| people

0

posted on Apr 12, 2024 5:28PM

ఇది శ్రీ కోధి నామ సంవత్సరం. క్రోధి అని పేరు వుండేసరికి జనానికి క్రోధం గుర్తొస్తుంది. ఈ సంవత్సరం జనం మీద క్రోధంగా వ్యవహరిస్తుందా అనే సందేహాలు చాలామందికి కలగడం సహజం. అయితే పండితులు చెప్పేది ఏమిటంటే, శ్రీ క్రోధి నామ సంవత్సరం అందరి మీదా క్రోధాన్ని ప్రదర్శించదు.. క్రోధంతో వ్యవహరించేవారి మీద మాత్రం క్రోధంగా వ్యవహరిస్తుంది.. అంటే, కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఈ వివరణ ఏపీ ప్రజలకు  ఆనందం కలిగించే విషయం.

ఐదేళ్ళ నుంచి ప్రజలు వైసీపీ క్రోధుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే వున్నారు. గత ఎన్నికల సందర్భంగా పెచ్చుమీరిపోయిన వైసీపీ వర్గాల క్రోధపు పనులు అధికారంలోకి వచ్చాక మరింత పెరిగిపోయాయి. ప్రతిపక్షాలకు చెందిన వారి విషయంలో క్రోధంగా వ్యవహరించడం, ఇంతవరకు రాజకీయ రంగంలో ఎప్పుడూ లేని విధంగా అకారణ కోపాన్ని ప్రదర్శించడం చూశాం.

వీరి క్రోధం రాజకీయాల వరకు ఆగిపోకుండా ఇళ్ళలో వుండే మహిళల వరకూ వెళ్ళడం గమనించాం. శ్రీ క్రోధి నామ 

సంవత్సరం పుణ్యమా అని ఈ క్రోధపు బ్యాచ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి విముక్తి కలిగితే అంతకంటే కావల్సింది ఏముంటుంది?

Exit mobile version