Wednesday, October 30, 2024

వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా క‌ష్ట‌మే.. తేల్చేసిన జన్మత్ పోల్ | ycp cant secure opposition satus| avinash| confine| third| place| kadapa| loksabha| seat| janmat| poll

posted on Apr 11, 2024 10:19AM

కడపలో లోక్ సభ స్థానంలో అవినాష్ రెడ్డి మూడో స్థానానికే పరిమితం

ప్రధాన పోటీ కూటమి అభ్యర్థి, షర్మిల మధ్యే

ఏపీలో మే13న జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల లో అధికార వైసీపీకి  జనం బిగ్ షాక్ ఇవ్వనున్నారు.  వచ్చే ఎన్నికలలో వైసీపీ పరాజయం ఖాయమన్న విషయాన్ని ఇప్పటికే  జాతీయ‌, రాష్ట్ర స్థాయిలోని ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాయి. మెజార్టీ   స‌ర్వేలు వైసీపీకి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 30 నుంచి 35 స్థానాలు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాయి. అయితే పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆ సంఖ్య త‌గ్గే అవకాశం ఉందని సర్వేలన్నీ అంచనా వేశాయి. ఇక తాజాగా జ‌న్మ‌త్ పోల్ స‌ర్వే అయితే వైసీపీకి విపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని తేల్చేసింది.  జన్మత్ పోల్ స‌ర్వే   వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా  క‌ష్ట‌మేనని పేర్కొంది. ఐదేళ్ల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌ పాల‌న సాగించారని, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు కూడా కనిపించడం లేదనీ, జగన్ పాలనలో సమాజంలోకి ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదనీ సర్వే ఫలితాలను బట్టి తేటతెల్లం అవుతోంది. జగన్ అస్తవ్యస్త, అరాచక పాలన పట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌నీ, అన్ని వ‌ర్గాల వారూ ఏకతాటిపైకి వ‌స్తూ వైసీపీ ప్ర‌భుత్వానికి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని జ‌న్మ‌త్ పోల్ త‌న స‌ర్వే ఫలితం స్ప‌ష్టం చేసింది. జ‌న్మ‌త్ పోల్ స‌ర్వే పేర్కొన్నమేరకు వైసీపీ గ్రాఫ్ ఏపీలో రోజురోజుకు ప‌డిపోతుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు సైతం బ‌స్సు యాత్ర‌లో పాల్గొనేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. 

జన్మత్ పోల్స్ సర్వే ఫలితాల ప్ర‌కారం.. ఏపీలోని   175 శాసనసభ స్థానాల్లో అత్య‌ధిక స్థానాలు కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తారు. తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మూడు పార్టీలు సీట్ల పంప‌కాల ప్ర‌క్రియ, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌  పూర్త‌యింది. మూడు పార్టీల అధ్య‌క్షులు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, పురందేశ్వ‌రిలు ప్ర‌చార ప‌ర్వంలో దూసుకెళ్తున్నారు. వీరి ప్ర‌చారానికి ప్ర‌జ‌ల మంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా.. ఇందులో 110 నుంచి 115 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే పేర్కొంది. జనసేన పార్టీ  అభ్య‌ర్థులు 21 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా.. 17 నుంచి 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధిస్తార‌ని, బీజేపీ పోటీ చేస్తున్న 10 స్థానాల‌కుగాను రెండు నుంచి మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే ఫ‌లితాల్లో తేలింది. ఇక అధికార వైసీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. వైసీపీ   175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్యర్ధులను రంగంలోకి దింపింది. అయితే వైసీపీ అభ్యర్థులు కేవలం  15 నుంచి 18 స్థానాల్లో మాత్ర‌మే   విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే పేర్కొంది. దీంతో వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదాకూడా రాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. పోలింగ్ స‌మ‌యం నాటికి వైసీపీ గ్రాఫ్ మ‌రింత‌గా ప‌డిపోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

వాస్త‌వానికి 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు గట్టగా మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా 2019 ఎన్నిక‌ల్లో అయితే.. రాయ‌ల‌సీమ జిల్లాల్లో  వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. కానీ, ప్ర‌స్తుతం ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌కు అధికారం మ‌త్తు త‌ల‌కెక్క‌డంతో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను మ‌రిచి ప్ర‌శ్నించిన వారిని హింసించ‌డం మొద‌లు పెట్టారు.  దీంతో వైసీపీ ప్ర‌భుత్వంపై రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జలు సైతం తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు వివేకానంద రెడ్డి హ‌త్య‌,   వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉండ‌టం, చంద్ర‌బాబు సీఎంగా ఉంటేనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్న ప్ర‌జ‌ల నమ్మకం ఇలా అన్నీ కలిసి ఇప్పటికే సీమలోని మెజారిటీ స్థానాలలో   వైసీపీ అభ్య‌ర్థుల ఓట‌మిని ఖరారు చేసేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయ‌ల‌సీమ ప్రాంతంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని, వైసీపీ మూడో స్థానానికి ప‌డిపోవ‌టం ఖాయ‌మ‌ని జ‌న్మత్ పోల్స్ స‌ర్వేలో  తేలింది. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖంగా చ‌ర్చించుకునే స్థానం క‌డ‌ప ఎంపీ   స్థానం. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌పున ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డి బ‌రిలోఉన్నారు. అవినాశ్ రెడ్డికి పోటీగా సీఎం జ‌గ‌న్ సోద‌రి, ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్‌ ష‌ర్మిల పోటీ చేస్తున్నారు. అయితే, వీరిద్ద‌రి మ‌ధ్య హోరాహోరీ పోరు ఉంటుంద‌ని ఇప్పటి వరకూ అంతా భావిస్తున్నారు. అయితే  అవినాశ్ రెడ్డి  ష‌ర్మిల‌కు పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే పేర్కొంది. 

క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో అవినాశ్ రెడ్డి మూడో స్థానంలో ఉంటారనీ, ప్ర‌ధాన పోటీ వైఎస్ ష‌ర్మిల, కూట‌మి అభ్య‌ర్థి మధ్యే ఉంటుంద‌ని జ‌న్మత్ పోల్స్ స‌ర్వే చెప్పింది. వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన నిందితుడుగా అవినాశ్ రెడ్డి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ద‌ర్యాప్తు సంస్థ‌లు సైతం అవినాశ్ రెడ్డి వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా చెబుతున్నాయి. అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారాన్ని ఉప‌యోగిస్తున్నాడ‌ని ఆయ‌న చెల్లెళ్లు ష‌ర్మిల‌, వివేకా కుమార్తె సునీత రెడ్డి  ఆరోపిస్తున్నారు. వివేకా హ‌త్య వెనుక అవినాశ్ రెడ్డి ఉన్నారని క‌డ‌ప లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గంలోని మెజార్టీ శాతం ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. ఈ క్ర‌మంలో అవినాశ్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ ఓటు బ్యాంకు అధిక శాతం వైఎస్ ష‌ర్మిల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. దీంతో కూట‌మి అభ్య‌ర్థి వ‌ర్సెస్ ష‌ర్మిల మ‌ధ్య హోరాహోరు పోటీ ఉండే అవ‌కాశం ఉంద‌ని   రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇదే విష‌యాన్ని జ‌న్మత్ పోల్స్ స‌ర్వే సంస్థ స్ప‌ష్టం చేసింది. మొత్తానికి ఇన్నాళ్లు వైసీపీకి కంచుకోట‌గాఉన్న క‌డ‌ప‌లోనూ ఆ పార్టీకి ఎదురుగాలి త‌ప్ప‌ద‌ని ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నీ తేల్చేస్తున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana