IPL 2024 Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్లో ది మోస్ట్ ఎంటర్టైనింగ్ టీమ్‌గా పేరున్న ఫ్రాంఛైజ్. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్లకు కొదవ లేదు, టాలెంట్‌కు కొరత లేదు. కానీ ఈ జట్టుకు 17ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్క ట్రోఫీ కూడా లేదు! ‘ఈ సాలా కప్ నమ్దే.. కప్ నమ్దే’ అంటూ ఆశలు పెట్టుకోవడం, చివరికి నెక్ట్స్ ఐపీఎల్‌కి ఆ మాటలను షిఫ్ట్ చేసుకోవడం ఫ్యాన్స్‌కి అలవాటైపోయింది. ఐపీఎల్ 2024లో కూడా ఇదే జరుగుతోంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి, మళ్లీ ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తోంది. మరీ ముఖ్యంగా.. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినా, అతని ఆట తీరును అందరు ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ మొత్తం.. ఆర్సీబీకి కట్టప్పలా ఉన్న కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి కోహ్లీ.. ఆర్సీబీకి హీరోనా? లేక విలన్ ఆ?