Home తెలంగాణ Maoists Letter : సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ బూటకం, రేవంత్ సర్కార్ బాధ్యత వహించాలి

Maoists Letter : సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ బూటకం, రేవంత్ సర్కార్ బాధ్యత వహించాలి

0

మావోల లేఖ పూర్తి సారాంశం…

“ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యం స్వభావం మారడం లేదు. ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టులపై తెలంగాణ, చత్తీస్ఘడ్ – మహారాష్ట్ర పోలీసులు రాజ్యహింసకు తెగబడుతున్నారు. కార్పోరేట్ కంపనీల అడుగులకు మడుగులొత్తేలా వారు పనిచేస్తున్నారు. ఈ హింసలో పార్టీలకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. బీజేపీ, కాంగ్రేస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలదీ ఒకటే వ్యూహం, ఒకటే దారి. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్షలు, ప్రతి విమర్శలు చేసుకున్నా పాలించే విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజాలు, వనరులను పెద్ద పెద్ద కంపనీలకు, సామ్రాజ్యవాద తొత్తులకు గుండుగుత్తగా తాకట్టు పెట్టే క్రమంలో అక్కడ ఉన్న ఆదివాసీ ఉద్యమాలను రాక్షసంగా అనగదొక్కుతున్నారు. దండకారణ్యం అంతా పోలీసు క్యాంపులతో నింపేస్తున్నారు. ఓ పక్క డ్రోన్లు, హెలీకాప్టర్లతో ఆకాశ మార్గంగుండా దాడులు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర సరిహద్దులో ముగ్గురు కామ్రేడ్స్ పై విషప్రైయోగం చేసి పట్టుకొని అతి కిరాతకంగా హింసించి ఎన్ కౌంటర్ కథలల్లారు. ఈ రోజు బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పూజారికాంకేర్ తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, కోబ్రా పోలీసులకి మావోయిస్టులకు మధ్య జరిగిన భయంకర యుద్ధంలో మా కామ్రేడ్స్ ముగ్గురు అమరులయ్యారు” అని లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version