పలు జిల్లాల్లో చిరు జల్లులు
అయితే ఆదిలాబాద్(Adilabad) సహా పలు జిల్లాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, కుమురం భీమ్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పలు జిల్లాల్లో వానలు(Rains) పడతాయని వెల్లడించింది.