posted on Apr 7, 2024 7:47AM
పాట్నాలోని బీహార్ మ్యూజియంలో జరుగుతున్న దక్షిణాసియా పురావస్తు సంఘం 8వ అంతర్జాతీయ సదస్సులో ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి ‘ప్రదర్శనశాలలు, వారసత్వ యాజమాన్యం’ విభాగానికి అధ్యక్షునిగా వ్యవహరించినట్లు ఆ సంఘం ప్రతినిధి డాక్టర్ శ్రీకాంత్ గన్వీర్ శనివారం (ఏప్రిల్ 6) తెలిపారు.
సమ్మేళనంలో ఒక విభాగానికి అధ్యక్షునిగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శివనాగిరెడ్డి ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సదస్సులో శివనాగిరెడ్డి ప్రసంగిస్తూ, పురావస్తు ప్రదర్శనశాలలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని, అలాగే వారసత్వ కట్టడాలను ప్రపంచ వారసత్వ కేంద్ర నియమాల ప్రకారం నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఆఫ్ సౌత్ ఏషియన్ ఆర్కియాలజీ అధ్యక్షులు, ప్రపంచ ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త, డా.వసంత్ షిండే శివనాగిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.