ఉగాది పంచాంగశ్రవణం
ఏప్రిల్ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది(Krodhi Nama Ugadi) పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన పండితులు ఆస్థానం, పంచాంగశ్రవణం నిర్వహిస్తారన్నారు. ఇందులో దేశకాల, రుతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారఫలాలను పండితులు తెలియజేస్తారని చెప్పారు. క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని(TTD Panchangam) భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని టీటీడీ బుక్‌స్టాళ్లలో అందుబాటులో ఉంచామన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టీటీడీ(TTD) సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉందన్నారు.