మీన రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు కలయిక జరుగుతుంది. దీనివల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు ఏప్రిల్ 9వ తేదీ ఉగాది రోజున మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే రాహువు, శుక్రుడు, సూర్యుడు సంచరిస్తున్నారు. మీనంలో ఈ నాలుగు గ్రహాల కలయిక వల్ల 50 ఏళ్ల తర్వాత చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది.