Home బిజినెస్ Ather Rizta launch: ఎలక్ట్రిక్ స్కూటర్స్ లోకి మరో స్టైలిష్ ఎంట్రీ; ఎథర్ రిజ్టా లాంచ్

Ather Rizta launch: ఎలక్ట్రిక్ స్కూటర్స్ లోకి మరో స్టైలిష్ ఎంట్రీ; ఎథర్ రిజ్టా లాంచ్

0

రెండు రైడింగ్ మోడ్స్

ఈ ఎథర్ రిజ్టా (Ather Rizta) ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్మార్ట్ ఎకో (SmartEco), జిప్ (Zip) అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకన్లలో అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని చేరగలదు. ఈ-స్కూటర్ బహుళ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తుంది. 2.9 కిలోవాట్ల యూనిట్ ఆప్షన్ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 105 కిమీలు ప్రయాణించవచ్చు. అలాగే, 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల (ట్రూరేంజ్) పరిధిని అందిస్తుంది. ఎథర్ రిజ్టా స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో సింగిల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్ 1 ప్రో, బజాజ్ చేతక్ వంటి వాటికి పోటీగా ఉంటుంది.

Exit mobile version