ఎక్స్ క్లూజివ్ ఆఫర్లు, డీల్స్
ఆమెజాన్ లో ఆపిల్ ఐ ఫోన్ 15 (iPhone 15) పై డిస్కౌంట్ తో పాటు వివిధ ఎక్స్ క్లూజివ్ ఆఫర్లు, డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అర్హత కలిగిన క్రెడిట్ కార్డు హోల్డర్లు బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ. 6,000 వరకు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. అంతేకాకుండా కస్టమర్లు సౌకర్యవంతమైన ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు, మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే రూ. 32,900 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, మీరు ఎక్స్చేంజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ మోడల్, బ్రాండ్, కండిషన్ పై ఆధారపడి ఎక్స్చేంజ్ బోనస్ మొత్తం మారుతూ ఉంటుంది.