posted on Apr 6, 2024 12:48PM
ఆదోని, కర్నూలులో కూటమి అభ్యర్థుల వైపే జనం
ముస్లిం మైనారిటీల మద్దతూ తెలుగుదేశం కూటమికే
కర్నూలులో పని చేయని వైసీపీ ముస్లిం కార్డ్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి బలం రోజు రోజుకూ పెరుగుతోంది. వైసీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గాలలో కూడా కూటమి బలపడుతోంది. తొలి నుంచీ కూడా వైసీపీకి రాయలసీమలో వైసీపీకి తిరుగులేని బలం ఉంది. అయితే ఈ సారి మాత్రం ఆ పార్టీకి అక్కడ కూడా ఎదురుగాలే వీస్తోందని సర్వేలు నిర్ద్వంద్వంగా చెబుతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో సీమలో ఈ సారి కూటమి మెరుగైన ఫలితాలు సాధించడం ఖాయమని తేల్చింది. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగా ప్రజలు తెలుగుదేశం కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే పేర్కొంది. ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో కూటమిదే అధికారమని తేల్చాయి. తాజాగా స్ట్రా పోల్ సంస్థ కర్నూలు జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోందని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ముఖ్యంగా కర్నూలు, ఆదోనిలలో తెలుగుదేశం కూటమికి తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తోందని సర్వే తేల్చింది.
కర్నూలులో తెలుగుదేశం పుంజుకోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు కానీ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న కర్నూలులో, అదీ కూటమి సీట్ల సర్దుబాట్లలో భాగంగా బీజేపీకి అభ్యర్థి పోటీ చేస్తున్న ఆదోనిలో కూడా కూటమిదే అధిపత్యం అని తేలడంతో ప్రాంతాలు, కులాలు, మతాలు, సామాజిక సమీకరణాలకు అతీతంగా రాష్ట్రంలో కూటమి జోరు కొనసాగుతోందని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆదోనిలో బీజేపీకి చెప్పుకోదగ్గ బలమైన నేతలు లేరు. క్యాడర్ లేదు. అయినా ఆ నియోజకవర్గంలో వైసీపీ కంటే బీజేపీ ముందంజలో ఉందంటే.. జనాలలో వైసీపీ సర్కార్ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఆదోని నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పార్థ సారథి బరిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా వై. సాయిప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాగా తాజా సర్వేలో డాక్టర్ పార్థ సారథికి 55.85% మంది మద్దతు పలుకుతుంటే.. వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డికి కేవలం 44.15% మంది మాత్రమే మద్దతుగా ఉన్నారని స్ట్రా సర్వే పేర్కొంది. అదోని అసెంబ్లీ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు గణనీయంగా ఉన్నప్పటికీ బీజేపీకే మొగ్గు ఉందని తేలడమంటే.. ముస్లిం మైనారిటీల్లో కూడా జగన్ పాలన పట్ల వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో అర్ధమౌతోందని పరిశీలకులు అంటున్నారు.
ఇక కర్నూలు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో ఉన్న టీజీ భరత్ కు 50 శాతం మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. వైసీపీ మైనారిటీ కార్డ్ ఉపయోగించినప్పటికీ ఇంతియాజ్ అహ్మద్ కు క ేవలం 37.5శాతం మంది ఓటర్లు మాత్రమే మద్దతుగా నిలిచారని సర్వే పేర్కొంది. మొత్తానికి ఆదోని, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది.