Tuesday, January 14, 2025

వైసీపీకి మరో షాక్… తిరిగి టిడిపి గూటికి డొక్కా మాణిక్య వరప్రసాద్ ?

posted on Apr 6, 2024 12:57PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇన్‌ఛార్జీల నియామకం వ్యవహారం.. సీనియర్ నేతల్లో అసమ్మతికి దారి తీస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి బహిరంగంగానే తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

తాజాగా ఈ జాబితాలో మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేరారు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తనకు శిరోధార్యమేనని అంటూనే తన అసమ్మతిని బయట పెట్టుకున్నారు. ఇన్‌ఛార్జీల మార్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జీగా మాజీ మంత్రి మేకతోటి సుచరితను నియమించడంపై ఆయన స్పందించారు.

తాజాగా ఈ జాబితాలో మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేరారు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తనకు శిరోధార్యమేనని అంటూనే తన అసమ్మతిని బయట పెట్టుకున్నారు. ఇన్‌ఛార్జీల మార్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జీగా మాజీ మంత్రి మేకతోటి సుచరితను నియమించడంపై ఆయన స్పందించారు.

 గత కొంతకాలంగా వైసీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన మంత్రి అంబటి రాంబాబు నిన్న సాయంత్రం డొక్కా ఇంటికి వెళ్లి చర్చించారు. పార్టీని వీడొద్దని, పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. అయితే, పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో డొక్కా అలక వీడలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన డొక్కాకు పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ పార్టీలో తనకు ప్రాధాన్యం కరవైందని, అధినేతను కలిసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. తనను సంప్రదించకుండానే తాడికొండ ఇన్‌చార్జిగా నియమించడం డొక్కాను తీవ్రంగా నిరాశపరిచింది. తరువాత తనను ఆ బాధ్యతల నుంచి తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నప్పటికీ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana