Thursday, January 16, 2025

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ శ్రేగణేష్ | contonment congress candidate sri ganesh| by| election| lasyanandita

posted on Apr 6, 2024 2:58PM

సికిందరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నకలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఖరారయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ్ శ్రీగణేష్ ను ఖరారు చేసినట్లు ఆ పార్టీ  కార్యదర్శి కేసీవేణుగోపాల్ శనివారం ( ఏప్రిల్ 6) ప్రకటించారు.

నారాయణ్ శ్రీగణేష్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి  కాంగ్రెస్  గూటికి చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నారాయణ్ శ్రీగణేష్ ను కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా సిఫారసు చేసింది. ఆ సిఫారసును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారు. 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంతో మరణించడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.  తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఈ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో శ్రీగణేష్ 41,888 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇదే స్థానం నుంచి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన  గద్దర్ కూతురు వెన్నెల  20,825 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.  

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana