Monday, January 20, 2025

కాంగ్రెస్ మోసాలకు కేరాఫ్ అడ్రస్, ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ కుటుంబమే కారణం- బండి సంజయ్-karimnagar bjp mp bandi sanjay sensational comments on congress brs phone tapping case ,తెలంగాణ న్యూస్

ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ కుటుంబమే కారణం

కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress BRS) రెండు పార్టీలు అవగాహనతో వెళుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోదు… కాళేశ్వరం అక్రమాలపై కేసీఆర్ కుటుంబంపై కేసులు పెట్టదని విమర్శించారు. అందుకు ప్రతిఫలంగా 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని అసెంబ్లీలో బీఆర్ఎస్ నిలదీయదని తెలిపారు‌. రెండు పార్టీలు లోపల కుమ్కక్కై పైన డ్రామాలాడుతున్నాయని, ప్రజలు గమనించాలని కోరారు. వాళ్లకు చిత్తుశుద్ధి ఉంటే కాళేశ్వరంపై(Kaleshwaram Project) సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుందని అందరికీ తెలుసు… దమ్ముంటే నయీం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై సిట్ విచారణను కొనసాగించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్, మియాపూర్ భూముల కుంభకోణంపై విచారణ జరపాలన్నారు. వీటిపై విచారణ జరపకుండా ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ దోషులను వదిలేది లేదని చెబుతున్నా, కేసీఆర్ కుటుంబమే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహరంలో ఉందన్నారు. మరి ఎందుకు వాళ్లను అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. నా ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేశారని, అందుకే ఆనాడు నేను ఈ విషయాన్ని పదేపదే చెప్పినా ఎవరు పట్టించుకోలేదన్నారు. అంతర్గత విషయాలను, పార్టీ కోర్ కమిటీలో చర్చించిన విషయాలను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ లాంటి చిల్లర పార్టీ ఇంకోటి లేదని, అందుకే సీబీఐ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబం (KCR Family)ఫోన్ ట్యాపింగ్ తో రాజకీయ లబ్ది పొందాలనుకుంటే… ట్యాపింగ్ చేసిన అధికారులు దానిని ఆసరాగా చేసుకుని ట్యాపింగ్ ద్వారా బెదిరించి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వంటి దుర్మార్గులు మా పార్టీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయడంతోపాటు కార్యకర్తలను రాచిరంపాన పెట్టారని తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana