దేశంలోని బ్యాంక్‌లకు డబ్బులను అప్పుగా ఇస్తుంది ఆర్బీఐ. అప్పుపై వడ్డీ రేటును వసూలు చేస్తుంది. దానిని రెపో రేట్ అంటారు. రెపో రేట్ పెరిగితే.. బ్యాంక్‌లకు కష్టమవుతుంది. అందుకే ఆ బ్యాంక్‌లు కూడా వివిధ లోన్లపై వడ్డీని పెంచుతాయి. రెపో రేటు తగ్గితే.. ఆర్బీఐకి బ్యాంక్‌లు ఇవ్వాల్సిన వడ్డీ కూడా తగ్గుతుంది. ఫలితంగా.. ప్రజలకు బ్యాంక్‌లు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి.