కన్యా రాశి
దరిద్రయోగం కన్యా రాశి వారికి చెడ్డ రోజులు తీసుకొచ్చి పెడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మీరు కోరుకున్నట్టుగా సహోద్యోగులు, సీనియర్ల నుంచి మద్దతు లభించుకోవచ్చు. శారీరకంగా గాయపడే అవకాశాలు ఉన్నాయి .ఈ సమయంలో ఎటువంటి కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. మాట తీరుతో ఇతరుల మనసు గాయపరుస్తారు. అందుకే మాటలు నియంత్రణలో ఉంచుకోవాలి. ఏదైనా పని మొదలు పెడితే ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి.