Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అప్పును గెస్ట్ హౌజ్‌కు రమ్మన్న బ్రోకర్‌ను పోలీసులు, మీడియా ముందు కొడతాడు కల్యాణ్. అప్పును పోలీస్ ట్రైనింగ్ కాకుండా అడ్డుకుంటున్నట్లు, ఇవాళ గెస్ట్ హౌజ్‌కు రమ్మన్నాడని చెబుతాడు. ఇలాంటి వాళ్ల వల్లే నాలుగు అడుగులు ముందుకు వేసి బయటకు వస్తున్న అమ్మాయిలు అలాగే వెనుకబడిపోతున్నారు అని కల్యాణ్ అంటాడు.