Wednesday, January 22, 2025

ఫ్యామిలీ స్టార్ లైవ్ అప్డేట్స్.. గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ అయిందా?-vijay devarakonda family star review box office collection live updates audience response mrunal thakur telugu film news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

ఫ్యామిలీ స్టార్ లైవ్ అప్డేట్స్

Vijay Devarakonda Family Star Live Updates: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు శుక్రవారం (ఏప్రిల్ 5)న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుందాం.

Fri, 05 Apr 202401:41 AM IST

కంప్లీట్ ఫ్యామిలీ బొమ్మ

ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజ‌య్ దేవరకొండ మరోసారి త‌న యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టేశాడ‌ని ఓ నెటిజ‌న్ తెలిపాడు. టైటిల్‌కు త‌గ్గ‌ట్టే కంప్లీట్ ఫ్యామిలీ బొమ్మ ఇద‌ని, మాస్ క‌మ‌ర్షియ‌ల్ మైండ్‌సెట్‌తో థియేట‌ర్‌కు వెళితే ఎంజాయ్ చేయ‌లేర‌ని అంటున్నారు. 

Fri, 05 Apr 202401:39 AM IST

ఓవర్సీస్ టాక్

ఏప్రిల్ 5న ఇండియాలో ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలకు రెడీ ఉండగా.. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. అక్కడ చూసిన సినీ ప్రేక్షకులు ఫ్యామిలీ స్టార్ మూవీపై రివ్యూలు ఇస్తున్నారు. 

Fri, 05 Apr 202401:38 AM IST

ట్రోలింగ్ బారిన

ఫ్యామిలీ స్టార్ సినిమాకు గోపీ సుందరం మ్యూజిక్ అందించారు. సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కల్యాణి వచ్చా వచ్చా అనే పాట మాత్రం కాస్తా ట్రోలింగ్ బారిన పడింది. 

Fri, 05 Apr 202401:38 AM IST

రెండోసారి

గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఫ్యామిలీ స్టార్ కావడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగినట్లుగా ప్రమోషనల్ కంటెంట్ ఉంది. 

Fri, 05 Apr 202401:37 AM IST

గీత గోవిందం

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో ఇదివరకు గీతగోవిందం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.

Fri, 05 Apr 202401:34 AM IST

ఫ్యామిలీ స్టార్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం, హాయ్ నాన్న సినిమాల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఫ్యామిలీ స్టార్ సినిమాకు నిర్మాతగా వ్యవహిరంచారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana