నాచారం ఏప్రిల్ 5 జనవాహిణి :- బీబీనగర్ మండలంలో ఉచిత మెడికల్ క్యాంపు ను ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బీబీనగర్ లో పూర్ణచంద్ర మేనేజర్ కమిటీ ప్రోగ్రాం ఆనంద్ ఐ హాస్పిటల్ హాప్సిగూడ హైదరాబాద్ వారి సహకారంతో వ్యాధుల గురించి మెడికల్ క్యాంపు నిర్వహించి వృద్ధులకు పిల్లలకు ఉచితంగా మందులు పంపించేశారు. క్యాంప్ ముగించుకొని ఎన్ఎస్ఎస్ విద్యార్థులు హైదరాబాద్ నాచారం సెయింట్ పాయిస్ డిగ్రీ మరియు పీజీ కళాశాలకు చేరుకున్నారు. విజయవంతంగా క్యాంప్ పూర్తిచేసుకుని వచ్చిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. క్యాంపు ద్వారా కొత్త అనుభవంతో జీవితంలో ముందుకు వెళ్లాలని వక్తలు పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సవిన్ సౌదా రామకృష్ణ రీజినల్ డైరెక్టర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జాతీయ సేవా పథకం ద్వారా చేపడుతున్న క్యాంపు ని సందర్శించారు వాలంటరీగా సామర్థ్యానికి, కృషిని ప్రశంసించారు. సెయింట్ పాయిస్ కళాశాల సహకారంతో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు ప్రీతి మరియు ఆర్తి ఆధ్వర్యంలో ఈ క్యాంపు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు పల్లె ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.