ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ లో పలు అంశాలను పేర్కొంది. కవిత(MLC Kavitha) చార్టర్డ్ అకౌంటెంట్, మరో నిందితుడు బుచ్చిబాబు గోరంట్ల మొబైల్ ఫోన్ నుంచి లభించిన వాట్సాప్ చాట్‌లు, విచారణలో లభించిన కొన్ని పత్రాలు, ఫోన్‌ల ఆధారంగా కవితను విచారించాల్సిన అవసరం ఉందని ప్రస్తావించింది.