మేష రాశి
హిందూ నూతన సంవత్సరం మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. దీనివల్ల అభ్యర్థులు చాలా సంతోషంగా ఉంటారు. వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మేషరాశి వారికి ఇది అత్యంత ప్రయోజనకరమైన సమయం. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బోలెడంత సంపద పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో లాభం పొందుతారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.